గంజాయి కట్టడికి ఎక్కడికక్కడ ప్రత్యేక నిఘా : పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి - Sankabrata Bagchi Sudden Visit
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 14, 2024, 1:25 PM IST
Visakha Police Commissioner Sankabrata Bagchi Sudden Visit PM Palem Police Station : సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే ప్రజలను పోలీస్‌స్టేషన్‌లో ఎక్కువసేపు ఉంచకుండా పనిచేయాలని విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి పోలీసులకు సూచించారు. విశాఖ పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌లో ఆయన అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువత అభివృద్ధికి ఆటంకంగా మారిన గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ట్రాఫిక్ సమస్యపై సీసీ కెమెరాల వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు.
విశాఖలో గంజాయి నివారించడానికి స్కూల్, కాలేజీ, బస్‌స్టేషన్‌ల్లో ప్రత్యేకంగా నిఘా పెట్టామని శంకబ్రత బాగ్చి వెల్లడించారు. గంజాయి వాడకం వల్ల జరిగే అనర్థాలను విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా అనుమానం ఉన్న ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. గంజాయి రవాణా, అక్రమాలపై పోలీసులు ఫిర్యాదు ఇవ్వడానికి ఫోన్‌కాల్స్ సదుపాయం కూడా కల్పించామని తెలిపారు.