జగన్ ఉత్తుత్తి ప్రారంభోత్సవాలను ప్రజలు నమ్మరు: కందుల నారాయణరెడ్డి - వెలిగొండ ప్రాజెక్టుకు జగన్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 5, 2024, 5:47 PM IST
Veligonda Project Opening TDP Leaders Press Meet : వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా ఈ ప్రాంత ప్రజలకు ఏం ఉద్ధరించారని సీఎం జగన్ వస్తున్నారని తెలుగుదేశం నేత కందుల నారాయణరెడ్డి ప్రశ్నించారు. రేపు దోర్నాలలో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం జగన్ వస్తున్న నేపథ్యంలో ఆయన మార్కాపురంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల (Election) స్టంట్లో భాగంగా జగన్ చేసే ఉత్తుత్తి ప్రారంభోత్సవాలను ప్రజలను నమ్మరని ఆయన అన్నారు.
Veligonda Irrigation Project in Prakasam : టీడీపీ హయాంలోనే 80 శాతం పనులు పూర్తి చేసిన ప్రాజెక్టును మిగిలిన ఇరవై శాతం నాలుగున్నరేళ్లుగా పూర్తి చేయలేని మీరా ఈ ప్రాజెక్టుని ప్రారంభించేది అని నిలదీశారు. ఈ ప్రాంత ప్రజలపై ఇప్పుడు ప్రేమ పుట్టిందా అని ఎద్దేవా చేశారు. మరి కొద్దిరోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకే వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Irrigation Project ) ప్రారంభమని జగన్ (Jagan) నాటకమని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలకు అసలు నగదు ఇవ్వకుండానే ప్రారంభిస్తామని ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రజలకు నిజనిజాలను వెల్లడించేందుకు గ్రామాల్లో పర్యటిస్తామని నారాయణరెడ్డి వెల్లడించారు.