ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తరలిపోయిన పరిశ్రమలతో సంప్రదింపులు చేస్తున్నాం: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ - Srinivasa Varma Visit Tirumala

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 4, 2024, 3:57 PM IST

Union Minister Srinivasa Varma Visit Tirumala: గత ఐదేళ్లు రాష్ట్రం నుంచి తరలిపోయిన పరిశ్రమలతో సంప్రదింపులు చేస్తున్నామని కేంద్రసహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. అలానే కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో కేంద్రమంత్రి వర్మ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వర్మకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

కేంద్రమంత్రి అయ్యాక మొదటిసారి శ్రీవారిని దర్శించుకున్నాని అన్నారు. రాష్ట్రానికి మంచి రోజులు ప్రారంభమయ్యాయని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని ప్రార్ధించాని తెలిపారు. రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు జగన్ గ్రహణం పట్టిందని దేవాలయాలను చిన్న చూపు చూశారన్నారు. ఇక నుంచి రాష్ట్రంలో దేవాలయాలకు రక్షణ కల్పిస్తామన్నారు. శ్రీవారి వరంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నా శుభ సూచికగా శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండిందన్నారు. అలాగే నాగార్జున జలాశయం కూడా రెండు మూడు రోజులు నిండుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details