ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్​ షా - Amit shah in Tirumala - AMIT SHAH IN TIRUMALA

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 31, 2024, 1:48 PM IST

Amit shah in Tirumala : సార్వత్రిక ఎన్నికల సందడి తుది అంకానికి చేరింది. దేశ వ్యాప్తంగా మొత్తం 7విడుతల్లో ఎన్నికల నిర్వహణ చేపట్టగా శనివారం తుది విడత పోలింగ్​ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగియడంతో.. దాదాపు 100 రోజులుగా వివిధ ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొన్న నేతలంతా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రధాని నరేంద్రమోదీ తమిళనాడులోని కన్యాకుమారిలో స్వామి వివేకానంద శిలా స్మారకం వద్ద 45గంటల మహా ధ్యానంలో నిమగ్నమయ్యారు. మరో వైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా తిరుపతి చేరుకున్నారు. 

తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న అమిత్ షా కు టీటీడీ ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోకి వెళ్లిన అమిత్ షా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం అమిత్ షా కు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం పలికారు. ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటాన్ని అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details