ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బావ, బావమరిదిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి- ఒకరు మృతి - కర్నూలులో కత్తులతో దాడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 1:51 PM IST

Two Persons Murdered in Kurnool District Andhra Pradesh : కర్నూలులో బావ, బావమరిదిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి (Attack) చేశారు. ఈ దాడిలో  ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కర్నూలు జిల్లా కేేంద్రం రోజా వీధికి చెందిన ఉప్పరి పెద్ద మూర్తి, ఉప్పరి సాయి రాత్రి ఆటోలో గ్రంథాలయం (Library) వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వారిపై కత్తులతో దాడి చేశారు. స్థానికులు ఘటనా స్థలానికి రావడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. 

Double Murder In Kurnool : రక్తపు మడుగులో ఉన్న బాధితులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సాయి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పెద్దమూర్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు (Police) దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు. దాడికి పాల్పడినవారు ఎవరనేది తెలియాల్సి ఉందని, విచారణ జరిపి నింధితులను త్వరలోనే అదులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details