రైతులపై ఎలుగుబంట్ల దాడి - తీవ్రగాయాలు - Bears attack farmers
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 26, 2024, 10:26 AM IST
Two Farmers Were Attacked by Bears in Ananthapur District : ఇద్దరు రైతులపై ఎలుగుబంట్లు దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో చోటు చేసుకుంది. కోడిపల్లి గ్రామానికి చెందిన రవిచంద్ర తన పొలంలో మొక్కజొన్న పంటకు నీళ్లు పెడుతుండగా అకస్మాత్తుగా పొలంలోకి వచ్చిన రెండు ఎలుగు బంట్లు అతనిపై దాడి చేశాయి. దీంతో అతను గట్టిగా కేకలు వేయడంతో ఏం జరిగిందోనని కంగారుగా పక్క పొలంలో ఉన్న తిమ్మయ్య అనే మరో రైతు అక్కడికి వచ్చాడు. అతని కూడా ఎలుగుబంట్లు దాడి చేశాయి.
దీంతో అక్కడ ఉన్న స్థానికులు గట్టిగా కేకలు వేసి వాటిని తరిమికొట్టారు. ఎలుగ బంట్ల దాడిలో ఇద్దరు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరిని గ్రామస్థులు కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. మరో రైతు తిమ్మయను రాయదుర్గం ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పొలంలోకి వెళ్లాలంటే రైతులు భయాందోళనకు గురవుతున్నారు.