LIVE: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రెస్మీట్ - ప్రత్యక్ష ప్రసారం - TTD CHAIRMAN BR NAIDU PRESS MEET
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 6, 2024, 5:09 PM IST
|Updated : Nov 6, 2024, 5:18 PM IST
TTD Chairman BR Naidu Press Meet Live: తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్గా బీఆర్ నాయుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం భూవరాహ స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకున్నారు. ఆయనకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో గరుడాళ్వర్ సన్నిధి వద్ద టీటీడీ ఈవో శ్యామలరావు బీఆర్ నాయుడితో ప్రమాణం చేయించారు. టీటీడీ 54వ ఛైర్మన్గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బీఆర్ నాయుడు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈవో శ్యామలరావు బీఆర్ నాయుడు దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్ర పటాన్ని వారికి అందజేశారు. మరోవైపు ధర్మకర్తల మండలి సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదు నెలల తర్వాత టీటీడీ పాలక మండలి తిరుమలలో కొలువు తీరింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం మీ కోసం
Last Updated : Nov 6, 2024, 5:18 PM IST