ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఉత్సాహంగా గిరిజనుల ఇటుకల పండుగ - దింసా నృత్యాలతో అలరించిన మహిళలు - Tribals Etukala Festival - TRIBALS ETUKALA FESTIVAL

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 22, 2024, 10:22 AM IST

Tribals Celebrated with Traditional Festival Was Enthusiasm: గిరిజన సంప్రదాయ ఇటుకల పండగ మన్యంలోని గిరి గ్రామాల్లో ఉత్సాహంగా జరిగింది. మహిళలు రహదారులపై కర్రలు, తాళ్లు పెట్టి వాహన వసూళ్లు చేశారు. వచ్చిన డబ్బుతో వంటలు చేసుకుని విందు భోజనాలు చేస్తున్నారు. మహిళలు ఊరంతా దింసా నృత్యాలు, వివిధ వేషాధారణలతో డప్పు వాయిద్యాలు, గొలుసు కట్టు నృత్యాలతో అందరినీ అలరించారు. ఇటుకల పండగ సందర్భంగా పాత పాడేరు గ్రామంలో మహిళలంతా ఒకవైపు అక్కాచెల్లెళ్లు, మరోవైపు వదినా మరదళ్లు ఇలా రెండు జట్లుగా విడిపోయి బడ్డులాగే పోటీలు నిర్వహించారు. 

వయసుతో సంబంధం లేకుండా మహిళలు ఎవరి బలం వారు నిరూపించుకున్నారు. ఇందులో అక్కాచెల్లెళ్లు విజయం సాధించారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు గెలిస్తే గ్రామంలో పాడి పంటలతో ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారని గిరిజనుల నమ్మకమని స్థానికులు తెలిపారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ గిరిజన సంప్రదాయ పండగ పాడేరులో జరుగుతోంది. ఒడిశా నందపూర్ వంశం వారు ప్రతి సంవత్సరం వచ్చి ఈ పండగ చేస్తున్నారని స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details