ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అంబటి వరెస్స్ కన్నా - సత్తెనపల్లిలో టెన్షన్ టెన్షన్ - Ambati vs Kanna - AMBATI VS KANNA

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 10:18 PM IST

Updated : May 13, 2024, 10:26 PM IST

Ambati vs Kanna: ఎన్నికల నేపథ్యంలో  పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నియోజకవర్గంలో కన్నాలక్ష్మీనారాయణ, అంబటి రాంబాబు ఒకరికొకరు ఎదురుపడటం ఉద్రిక్తతలకు దారితీసింది. ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో అంబటి రాంబాబు పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి హడావుడి చేశారు. దీంతో ఓటర్లు కొంత ఆందోళనకు గురయ్యారు. ఘటనపై టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణ విషయం తెలియజేశారు. విషయం తెలుసుకున్న లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) చాగంటివారిపాలెం చేరుకున్నారు. పోలింగ్ బూత్ లోనే ఒకరికొకరు ఎదురుపడటంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో రెండు పార్టీల కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలింగ్ కేంద్రంలోకి దూరి ఓటర్లను భయపెడితే ఊరుకునేది లేదని టీడీపీ నేతలు హెచ్చరించారు. టీడీపీ నేతల నుంచి ప్రతిఘటన ఎదరుకావడంతో పోలీసుల సాయంతో అంబటి అక్కడి నుంచి జారుకున్నారు.  అంబటి (Ambati) తీరుపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేయడాకి వచ్చిన వారిని వైసీపీ నేతలు ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. 

Last Updated : May 13, 2024, 10:26 PM IST

ABOUT THE AUTHOR

...view details