తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం - ప్రత్యక్షప్రసారం - Telangana Budget 2024 LIVE - TELANGANA BUDGET 2024 LIVE

By ETV Bharat Telangana Team

Published : Jul 25, 2024, 12:05 PM IST

Updated : Jul 25, 2024, 1:52 PM IST

Telangana Assembly Budget Session 2024 LIVE  : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25కు పూర్తి బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టింది. శాసనసభలో ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పద్దును ప్రవేశపెట్టారు. అంతకు ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్‌కు అనుమతి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తి పద్దును ప్రతిపాదించింది. బడ్జెట్‌లోని నిర్వహణ పద్దులో దాదాపుగా ఎలాంటి మార్పులు ఉండకపోగా ప్రగతి పద్దులో మాత్రమే కొంత మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మార్పులు, చేర్పులు ప్రతిపాదించారు. ఎఫ్​ఆర్​బీఎమ్ పరిధికి లోబడి తీసుకునే రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే స్పష్టత వచ్చింది. కేంద్రం నుంచి వివిధ రూపాల్లో రాష్ట్రానికి వచ్చే నిధులు ఎంత అన్నది కూడా దాదాపుగా తేలిపోయింది.
Last Updated : Jul 25, 2024, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details