ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చంద్రబాబును విమర్శించే అర్హత పెద్దిరెడ్డికి లేదు: వర్ల రామయ్య - peddireddy ramachandra reddy

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 10:15 AM IST

TDP Varla Ramaiah Fires on Minister Peddireddy: రాజకీయాలను అడ్డుపెట్టుకుని వేలకోట్లు సంపాదించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబుని విమర్శించే అర్హత లేదని తెలుగుదేశం నేత వర్ల రామయ్య అన్నారు. పెద్దిరెడ్డి నేరచరిత్ర రాష్ట్రమంతా తెలుసన్న వర్ల రామయ్య, అధికారంలోకి రాగానే అవినీతిని కక్కిస్తామని స్పష్టం చేశారు.

చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి ప్రత్యేక సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నారని, అక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఆదేశాలు అమలు కావని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. స్థానిక పోలీస్‌ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావాలన్నా, రెవెన్యూ కార్యాలయంలో పాస్‌బుక్‌ ఇవ్వాలన్నా పెద్దిరెడ్డి అనుమతి కావాల్సిందేనని విమర్శించారు. 

ఒక సాధారణ కాంట్రాక్టర్‌గా ఉన్న వ్యక్తి నేడు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. స్మగ్లర్‌ వీరప్పన్‌ చనిపోయాక, ఆ స్థాయిలో ఎర్రచందనం అక్రమ రవాణా ఎవరి కనుసన్నల్లో జరుగుతోందో చెప్పాలన్నారు. కొల్లం గంగిరెడ్డికి మీకు ఉన్న సంబంధమేంటని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు సైతం మంత్రి పెద్దిరెడ్డిని కాదని స్వతంత్రంగా వ్యవహరించలేరని వర్ల రామయ్య ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details