ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చంద్రబాబుపై పెట్టిన కేసులు పటాపంచలౌతున్నాయి : టీడీపీ ఎమ్మెల్సీ అశోక్​బాబు - Ashok Babu Comments on Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2024, 12:09 PM IST

TDP MLC Ashok Babu Comments on Jagan in Vijayawada : సూర్య, చంద్రులకు పట్టిన గ్రహణాలు వీడినట్లు చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ పటాపంచలౌతున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్​బాబు అన్నారు. ఇన్నర్​ రింగ్​ రోడ్డు కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా ఎదురు దెబ్బ తగిలిందని పేర్కొన్నారు. ఈ కేసు సెక్షన్​ 420 కిందకి రాదని సుప్రీంకోర్టు తేల్చిన విషయాన్ని వ్యాఖ్యానించారు. ఇప్పుడైనా సైకో ముఖ్యమంత్రికి బుద్ధి రావాలని అన్నారు.  

ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డి తన కేసుల్లో 3 వేల సార్లు ఎందుకు వాయిదాలు తీసుకుంటున్నారని అశోక్​బాబు ప్రశ్నించారు. ప్రస్తుతం జగన్​ చేస్తున్న దుర్మార్గాలపై రోజుకో కేసు పెట్టొచ్చని పేర్కొన్నారు. సాక్షులను విచారించకుండానే చంద్రబాబును అరెస్ట్​ చేయించారని మండిపడ్డారు. జగన్​ కక్షపూరితంగానే చంద్రబాబు, టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులను పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే జగన్​కు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీనే అధికార పగ్గాలు చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details