ముమ్మరంగా కొనసాగుతున్న టీడీపీ ప్రచారాలు - కూటమితోనే అభివృద్ది సాధ్యమని వెల్లడి - TDP Election Campaign - TDP ELECTION CAMPAIGN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 13, 2024, 1:37 PM IST
TDP leaders Election Campaign: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో దూకుడు పెంచారు. సభలు, సమావేశాలు నిర్వహించి ఓటర్లతో మమేకమవుతున్నారు. ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరుతున్నారు.
Kinjarapu Achchennaidu Election Campaign: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి సూపర్‌సిక్స్ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ శ్రేణులు అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. గ్రామాల అభివృద్ధి తన బాధ్యత అని, కూటమి అధికారంలోకి వచ్చాక గ్రామాల రూపురేఖలు మారుస్తామని అచ్చెన్నాయుడు అన్నారు.
Payyavula Keshav Election Campaign: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం అభ్యర్థి పయ్యావుల కేశవ్ విజయంతోనే సాధ్యమని ఆ పార్టీ యువ నాయకులు పయ్యావుల విక్రమసింహ పేర్కొన్నారు. ఉరవకొండ మండలం నెరమెట్ల, నింబగల్లు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి శూన్యం అని అన్నారు.