టీడీపీ నేతలను ఎందుకు కొట్టారో జవాబివ్వాలి - లేకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాం- టీజీ భరత్ డిమాండ్ - KURNOOL POLICE BEAT TDP LEADERS - KURNOOL POLICE BEAT TDP LEADERS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 3, 2024, 10:50 AM IST
Tdp Leaders Beaten By Police At Kurnool: కర్నూలులో టీడీపీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశం నేత టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేతలను కౌన్సిలింగ్ పేరుతో పోలీసులు ఫోన్ చేసి పిలిచి విచక్షణారహితంగా కొట్టారని మండిపడ్డారు. ఎందుకు కొట్టారో చెప్పాలని కర్నూలు భరత్ డిమాండ్ (Demand) చేశారు. తమ పార్టీ నేతలపై ఎలాంటి కేసులు, రౌడీ షీట్లు (Rowdy sheets) లేవని భరత్ తెలిపారు.
Tdp Kurnool Candit Tg Bharat Fired on Police: టీడీపీ నేతలపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దీనిపై సరైన సమాధానం ఇవ్వకపోతే విషయాన్ని ఎన్నికల కమిషన్ (Election Commission) దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని భరత్ హెచ్చరించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకుంటే రాష్ట్రంలో ఇదే అరాచక పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని భరత్ మండిపడ్డారు.