ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్సీపీ సర్కారుపై ఈసీ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది : టీడీపీ నేత వర్ల రామయ్య - TDP leader Varla Ramaiah - TDP LEADER VARLA RAMAIAH

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 7:48 PM IST

TDP leader Varla Ramaiah Fire on YCP Election Gifts : సీఎం జగన్​ మోహన్​ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చింది పాంట్రీ కారో, ఫైనాన్స్ కారో ఈసీ తేల్చాలని కోరుతున్నామని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. డీజీపీకి ఫిర్యాదు చేస్తే ఆయన కనీసం విచారణ కూడా చేయకుండా పాంట్రీ కార్ అనే చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఇక ఎవరికీ ఫిర్యాదు చేయాలని మండిపడ్డారు.

తిరుపతి ఎయిర్ పోర్టు పక్కనే ఉన్న గోదాముల్లో వైసీపీ ఓటర్ లకు ఇచ్చే ఉచితాల లోడ్ దిగిందన్నారు. దీనిపై ఆధారాలుతో సహా ఫిర్యాదు చేశామని వర్ల పేర్కొన్నారు. మూడు గోదాముల్లో కుక్కర్లు, ఫ్యాన్లు, వాచ్​లు ఉన్నాయని ఆరోపించారు. వీటిపై ఫిర్యాదు చేస్తే ఎమ్మార్వో, కలెక్టర్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వంలో పెద్దల వ్యవహారం అని టీడీపీ చేసిన ఫిర్యాదును పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సీఈఓ ను కోరుకుంటున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details