ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జగన్ నీఛమైన ప్రచారానికి దిగాడు- అంబేడ్కర్‌ విగ్రహాన్ని కూలుస్తామంటూ అసత్య ప్రచారం: దూళ్ళిపాళ్ల - అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2024, 1:29 PM IST

TDP Dhulipalla Narendra Kumar Fire on YSRCP Leaders : ఓట్ల కోసం జగన్ నీచమైన స్ధాయికి దిగజారుతున్నాడని టీడీపీ సీనియర్ నేత దూళ్ళిపాళ్ల నరేంద్ర కుమార్ మండిపడ్డాడు. టీడీపీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తామని తాను చెప్పినట్లు అబద్ధపు మాటలు ప్రచారం చేయిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఇచ్చే చిల్లర పైసలకు కక్కుర్తి పడి పేటియం బ్యాచ్ కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు చిల్లర పోస్టులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. 

కుల, మత రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్‌ చేసిన పోరాటంపై తెలుగుదేశం పార్టీ తోపాటు, నేతలుగా మాకు ఎంతో గౌరవం ఉందని దూళ్ళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి దళితులు, అణగారిన వర్గాలపై దాడులు చేస్తూ జగన్ సైకో పాలన సాగిస్తున్నాడని దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించి ప్రజల్లో గందరగోళం సృష్టించి తిరిగి అధికారంలోకి రావాలన్న కుట్రలు పన్నుతున్నాడని ఎద్దేవా చేసారు. ప్రజలు జగన్​ను నమ్మే పరిస్ధితుల్లో లేరన్నారు. మహానుభావుడు అంబేద్కర్​ను తన తప్పుడు ప్రచారానికి వాడుకుంటున్నందుకు జగన్ సిగ్గుపడాలని హితవు పలికారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details