LIVE: సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం - ప్రత్యక్ష ప్రసారం - Chandrababu oath ceremony as AP CM - CHANDRABABU OATH CEREMONY AS AP CM
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 12, 2024, 9:45 AM IST
|Updated : Jun 12, 2024, 12:39 PM IST
Chandrababu Oath Ceremony Live as AP CM : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు మంగళవారం సాయంత్రానికి పూర్తయ్యాయి. కృష్ణా జిల్లా కేసరపల్లిలో సభాప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి బుధవారం మధ్యాహ్నం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. వారితో పాటే మరో 23 మంది మంత్రులూ ప్రమాణం చేయనున్నారు. ఉపముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఒక్కరే ఉంటారు. పవన్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక 1.15 గంటల సమయంలో ప్రకటించారు. ఒక స్థానాన్ని ఖాళీ ఉంచారు. జనసేనకు మూడు, భాజపాకు ఒక స్థానం కేటాయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, అగ్రనటులు చిరంజీవి, రజనీకాంత్ తదితరులు వస్తుండడంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. గన్నవరం మండలం కేసరపల్లిలో సభ కోసం 11.18 ఎకరాలను సిద్ధం చేశారు. 36 గ్యాలరీల్లో అందరికీ వేదిక కనిపించేలా ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటుచేశారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా నాలుగు గ్యాలరీలు సిద్ధం చేశారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం - ప్రత్యక్ష ప్రసారం
Last Updated : Jun 12, 2024, 12:39 PM IST