ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై తెలుగుదేశం ఛార్జిషీట్ - TDP charge sheet on Anjad Basha - TDP CHARGE SHEET ON ANJAD BASHA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 12:46 PM IST

TDP charge sheet on Deputy CM: ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గత ఐదేళ్లుగా సొంత ఆస్తులు కూడబెట్టు కోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని  కడప టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి తన నియోజకవర్గం అభివృద్ధి గురించి పట్టించుకోలేదని మాధవీరెడ్డి విమర్శించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, ఇన్ ఛార్జి మాధవీరెడ్డి,  కడప పార్లమెంటు అభ్యర్థి భూపేష్ రెడ్డి ఆద్వర్యంలో అంజాద్ బాషాపై ఛార్జిషీట్ విడుదల చేశారు. 

 కడప నగరంలో తాగునీటి సమస్య తాండవిస్తోందని, వారానికోసారి మంచినీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉందని మాధవీరెడ్డి పేర్కొన్నారు. నగరంలో ఎక్కడికక్కడ రోడ్లు తవ్వేసి వదిలేశారని ఆరోపించారు. మురుగునీటి వ్యవస్థ అద్వానంగా మారిందని పేర్కొన్నారు. బుగ్గవంక సుందరీకరణ పేరుతో అంజాద్ బాషా కోట్ల రూపాయలు దండుకున్నారని తెలిపారు. నగరంలో ఎక్కడ చూసినా భూ కబ్జాల పాల్పడుతున్నారని, అక్రమ లేఅవుట్లు వేసి ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని ఛార్జిషీట్ లో పేర్కొన్నారు. అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా, ఇటీవల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన వీడియోను ఛార్జిషీట్ లో పెట్టారు. నగరంలో గంజాయి మత్తులో యువత పాడవుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని మాధవీరెడ్డి విమర్శించారు.  

ABOUT THE AUTHOR

...view details