ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రతి ఇంటికి ఉచితంగా మరో గ్యాస్​ సిలిండర్​ - గురజాల మేనిఫెస్టో ప్రకటించిన యరపతినేని - Yarapathineni Released Manifesto

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 22, 2024, 1:08 PM IST

TDP Yarapathineni Released Gurajala Manifesto : పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తన నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించారు. పిడుగురాళ్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన ప్రణాళికను విడుదల చేశారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాల్లో (TDP Super Six Schemes) ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారని, వాటికి అదనంగా ప్రతి ఇంటికి ఒక గ్యాస్ సిలిండర్‌ను ఉచితంగా అందచేస్తానని యరపతినేని ప్రకటించారు. నియోజకవర్గంలోని 2 లక్షల 15 వేల మందికి చంద్రన్న బీమా ప్రీమియం(Chandranna Bheema Yojana) చెల్లిస్తానని హామీ ఇచ్చారు.

గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాకు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో నియోజకవర్గంలో అరాచకం రాజ్యమేలిందని యరపతినేని మండిపడ్డారు. గురజాల నియోజకవర్గంలో వైసీపీ నేతలు గాలి, నీరు వదిలిపెట్టకుండా రాబందుల్లా దోచుకున్నారని దుయ్యబట్టారు. కాసు మహేష్ హత్యా రాజకీయాలతో 11 మంది చనిపోయారని ఆరోపించారు. 3వేల ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 155 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో గెలుపొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details