ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'జగనన్న ట్యాబ్​'లో రాజకీయ ప్రసంగాన్ని చిత్రీకరించిన విద్యార్థి - జగనన్న ట్యాబ్​లో షూటింగ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2024, 4:37 PM IST

Students Captured Political Meeting in Byjus Tab: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, డిజిటల్‌ విద్యా బోధనలకు జగన్ సర్కార్ నాంది పలికింది. ఇప్పటికే పాఠశాలల్లో వినియోగించే ట్యాబ్​ (tab)లపై అనేక విమర్శలు వస్తున్నాయి. తాజాగా బీజేపీ సభకు సంబంధించిన కార్యక్రమాన్ని జగనన్న ఇచ్చిన ట్యాబ్​లో చిత్రీకరించటం ప్రస్తుతం వైరల్​గా మారింది. బైజూస్‌ ట్యాబ్‌లకు లాక్‌ సిస్టమ్‌ ఉంటుంది. అందులో ఉన్న కంటెంట్‌ను చదువుకోవడానికి మాత్రమే పనికి వస్తుందని చెబుతున్న జగనన్న ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలో బుధవారం బీజేపీ నాయకులు బహిరంగ సభ (meeting) నిర్వహించారు. అక్కడికి కరిబసవస్వామి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు (students) పాఠశాల బ్యాగులతో వచ్చి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ప్రసంగాన్ని ఓ విద్యార్థి ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్​లో చిత్రీకరించాడు. పాఠాలకు ఈ ట్యాబ్​ను ఉపయోగిస్తున్నాడో ? లేదో ? కానీ రాజకీయ ప్రసంగానికి మాత్రం బాగా ఉపయోగిస్తున్నారు అంటూ పలువురు విమర్శిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details