ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తిరుపతి ఎస్వీ వర్శిటీలో హైటెన్షన్‌ - వీసీ చాంబర్‌ను చుట్టుముట్టిన విద్యార్థి సంఘాలు - Student Unions Concerns in SVU - STUDENT UNIONS CONCERNS IN SVU

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 7, 2024, 7:49 PM IST

Student Unions Demanded for Resignation of SV University VC : తిరుపతి ఎస్వీ వర్శిటీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాలు (Student Groups) వీసీ చాంబర్‌ను చుట్టుముట్టాయి. దీంతో వీసీ ఛాంబర్‌ దగ్గర హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. వీసీ శ్రీకాంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నియామకాలతో కోట్లాది రూపాయల అవినీతికి ఎస్వీయూ వీసీ పాల్పడ్డారంటూ విద్యార్ధి సంఘాలు, బోధన బోధనేతర సిబ్బంది ఆరోపించారు. దీంతో ఎస్వీ యూనివర్సిటీలోని వీసీ ఛాంబర్​ను విద్యార్థి సంఘాలు చుట్టుముట్టి నిరసన చేపట్టారు. 

ఆందోళనల కారణంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్ధితి ఏర్పడింది. వీసీ శ్రీకాంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేశాయి. కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని బీసీ, ఎస్సీ, టిఎన్ఎస్ఎఫ్, అకడమిక్ కన్సల్టెంట్ యూనియన్ ప్రతినిధులు ఆరోపించారు. శ్రీకాంత్‌రెడ్డి వీసీగా కాకుండా వైసీపీ ప్రతినిధిగా పనిచేశారని విద్యార్థి సంఘలు విమర్శించారు. వీసీ చేసిన అవినీతిపై విచారణ చేయించాలని నినాదాలు చేశారు. నిరననల నేపథ్యంలో వీసీ ఛాంబర్ నుంచి వెనుతిరిగారు. 

ABOUT THE AUTHOR

...view details