ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

డిమాండ్ల పరిష్కారం కోసం 6న సర్పంచుల 'చలో అసెంబ్లీ' - YVB Rajendra Prasad Chalo Assembly

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 3:01 PM IST

Panchayat Raj Chamber President YVB Rajendra Prasad On Chalo Assembly: సర్పంచుల డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 6వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీని ముట్టడిస్తామని రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 12 వేల 918 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14, 15 ఆర్థిక సంఘం ద్వారా 8 వేల 629 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ నిధ‌ులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు. తక్షణమే ఆ నిధులను సర్పంచుల ఖాతాల్లో జమ చెయ్యాలని డిమాండ్‌ చేశారు.

గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు, గ్రామ పంచాయతీ, సర్పంచుల ఆధీనంలోనే పని చేయించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిధులను చట్ట ప్రకారం గ్రామ పంచాయితీలకు ఇచ్చి సర్పంచ్​లతో ఖర్చు చేయించాలన్నారు. గతంలో మాదిరే గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇచ్చి, వేతనం పెంచాలని డిమాండ్‌ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details