ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైభవంగా సుదర్శన నరసింహ యజ్ఞం - పాల్గొన్న వేలాది భక్తులు - Simhaadri sudarshana yagnam - SIMHAADRI SUDARSHANA YAGNAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 7:19 PM IST

Simhaadri Sudarshana Yagnam in Visakha District : ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయంలో 2వ రోజు శ్రీ సుదర్శన మహా యజ్ఞం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మేరకు గురువారం స్వాతి నక్షత్రాన్ని(సింహాద్రి నాధుడు జన్మ నక్షత్రం) పురస్కరించుకొని వేలాది మంది భక్తులు యజ్ఞంలో పాల్గొన్నారు. ఒకవైపు సర్వాభరణాలతో గోవిందరాజు స్వామి,మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాళ్​ను వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ శాస్త్రోక్తముగా పూజ కార్యక్రమాలు జరిపించారు. 

Simhachalam Simhaadri Appanna : భక్తులకు గోత్రనామాలతో పూజలు జరిపించి వారికి యజ్ఞ ప్రసాదం, భోజన సదుపాయం కల్పించారు. యజ్ఞంలో భాగంగా స్వర్ణ కవచ అలంకరణలో సింహాద్రినాధుడు భక్తులకు దర్శనం ఇచ్చారు. యజ్ఞం మహా పూర్ణాహుతిలో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ దంపతులు పాల్గొని పూజలు జరిపారు. ఆలయ ఈవో ఎస్. శ్రీనివాస్ మూర్తి ఆధ్వర్యంలో భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details