ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రోత్సాహక నగదు విడుదల చేయాలి - పట్టు రైతుల ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 9:30 PM IST

Silk Farmers Protest on Road: రాష్ట్ర ప్రభుత్వం పట్టు రైతులు, రీలర్లకు చెల్లించాల్సిన ప్రోత్సాహక నగదు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేశారు. నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులు, రీలర్లకు నగదును చెల్లించట్లేదని పట్టు రీలర్లల అసోసియేషన్ సభ్యుడు ముస్తఫా మండిపడ్డారు. రైతులు, డీలర్లు పట్టు గూళ్ల మార్కెట్లో విక్రయాలను నిలిపివేసి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నామని తెలిపారు.

ఏడు రోజులుగా రైతులు, రీలర్లు ఆందోళన బాట చేపట్టినా ముఖ్యమంత్రి జగన్​కు కనీసం చీమకుట్టినట్లైనా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం నగదును విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పట్టుగూళ్ల మార్కెట్ వద్ద ఉన్న ప్రధాన రహదారిపై రైతులు, రీలర్లు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వం రైతులు, రీలర్లకు రావాల్సిన ఇన్సెంటివ్​లను వెంటనే చెల్లిస్తే పట్టు పరిశ్రమ శాఖ ఆర్థికంగా మెరుగుపడుతుందని రైతులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని రైతులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details