ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

డాక్టర్ లైంగిక వేధింపులు - ఉన్నతాధికారులకు ఏఎన్ఎంల ఫిర్యాదు - Sexual Allegations on Doctor Uday - SEXUAL ALLEGATIONS ON DOCTOR UDAY

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 26, 2024, 10:16 AM IST

Sexual Allegations Against Doctor Uday : శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి పీహెచ్‌సీలో పని చేస్తున్న వైద్యుడు ఉదయ్‌పై లైంగిక ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. డాక్టర్ ఉదయ్ తమను కొంత కాలంగా వేధిస్తున్నాడంటూ ఏఎన్ఎంలు ఆరోపించారు. వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజు రాత్రి తొమ్మిది గంటల దాటగానే డాక్టర్​ అసభ్యకర సందేశాలు పంపుతున్నారని ఏఎన్​ఎంలు తెలిపారు. దీంతో కొంతకాలంగా మానసిక ఒత్తిడి గురై ఎవరితోనూ చెప్పుకోలేక అంతర్గతంగా కుమిలిపోతున్నామని వారు అన్నారు. ఈ విషయం బయటకు చెబితే ఉద్యోగ పరంగా ఇబ్బందులు పెడతానని బెదిరించినట్లు వారు వాపోయారు.

'మీరు కాకపోతే మీ పిల్లలను పంపించండి, అలా చేయకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేదా రాజీనామా చేయండి' అంటూ డాక్టర్ ఉదయ్ ఒత్తిడి చేస్తున్నారని ఏఎన్ఎంలు అన్నారు. చేసేదేమీ లేక మంగళవారం జిల్లా వైద్యాధికారి మంజు వాణికి ఏఎన్ఎంలు యూనియన్ నాయకులతో కలిసి వెళ్లి ఫిర్యాదు చేశారు. వైద్యుడు పంపిన సందేశాలను ఆమెకు చూపించారు. దీంతో జిల్లా వైద్యాధికారి సమగ్ర విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details