105 కేసుల్లో నిందితుడు- ఎన్నికల వేళ ఏపీకి భారీగా అక్రమ మద్యం తరలిస్తూ దొరికిపోయాడు - SEB Police Seized Telangana Liquor
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 7, 2024, 10:50 PM IST
SEB Police Seized Telangana Liquor: సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మద్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి తరలించేందుకు ఒక్కొక్కరూ ఒక్కో ప్లాన్ వేస్తున్నారు. తాజాగా కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్పోస్ట్ వద్ద సెబ్ అధికారులు భారీగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కడప జిల్లాకు మినీ ట్రాన్స్పోర్ట్ వాహనంలో వరిపొట్టు ముసుగులో మద్యాన్ని తరలిస్తుండగా సెబ్ అధికారులు పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ జిల్లా పర్యవేక్షకుడు రవికుమార్ తెలిపారు.
ఈ కేసులో 14 లక్షల 50 వేల రూపాయలు విలువ చేసే మద్యం, మిని ట్రాన్స్పోర్ట్ వాహనాన్ని సీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కడప జిల్లా పల్లఓలు గ్రామానికి చెందిన రింగుల బాషగా గుర్తించారు. రింగుల బాషపై అక్రమ మద్యం తరలింపు, ఎర్రచందనం కేసులు, అధికారులపై దాడులకు పాల్పడిన కేసులు మొత్తం 105 ఉన్నాయని రవికుమార్ తెలిపారు. రింగుల బాషతో పాటు లారీ డ్రైవర్ సాదిక్, క్లీనర్ షఫీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.