ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

హైదరాబాద్​లో ప్రమాదం - తండ్రి రోడ్డు దాటిస్తుండగా కుమార్తెను ఢీకొట్టిన స్కూల్ బస్సు - వీడియో వైరల్ - Road Accident in Hyderabad - ROAD ACCIDENT IN HYDERABAD

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 21, 2024, 12:53 PM IST

Young Woman Injured After Hit By School Bus  : హైదరాబాద్​నగర శివారు రాజేంద్రనగర్ అత్తాపూర్ వద్ద రోడ్డు దాటుతున్న బీఫార్మసీ విద్యార్థిని హారికను ఢీ కొట్టిన స్కూల్ బస్సును పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్​ను అరెస్ట్ చేసి బస్సును సీజ్ చేశారు. అత్తాపూర్‌కు చెందిన రామ్‌రెడ్డి కుమార్తె హారిక(22) హైటెక్‌సిటీలోని ఓ ఫార్మా కంపెనీలో ఇటీవలే ఉద్యోగంలో చేరారు. అత్తాపూర్‌ ప్రధాన రహదారిపైకి వచ్చి కంపెనీ బస్సులో ఆమె నిత్యం విధులకు వెళ్తుంటారు.

School Bus Accident in Hyderabad : మంగళవారం ఉదయం అత్తాపూర్‌ పిల్లర్‌ నంబర్‌ 130 వద్ద మెహిదీపట్నం వైపు వెళ్లడానికి తండ్రి రాంరెడ్డి చేయి పట్టుకొని హారికను రోడ్డు దాటిస్తున్నాడు. కంపెనీ బస్సు వచ్చి ఆగడంతో తండ్రి హారికను వేగంగా రోడ్డు దాటించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఆరాంఘర్‌ వైపు నుంచి మెహిదీపట్నం వెళ్తున్న టైమ్స్‌ పాఠశాల బస్సు వేగంగా వచ్చి తండ్రిని దాటుకుని కుమార్తెను బలంగా ఢీ కొట్టింది. హారిక ఎగిరి పది అడుగుల దూరంలో పడింది. వెంటనే స్థానికుల సాయంతో కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. హారిక పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details