'దిల్లీ లిక్కర్ స్కాం కంటే ఏపీలో జరిగిందే ఎక్కువ- జగన్ జైలుకెళ్లకుండా తప్పించుకోలేరు' - MLA Somireddy Fires on Jagan - MLA SOMIREDDY FIRES ON JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 21, 2024, 5:11 PM IST
MLA Somireddy Chandramohan Reddy Fires on Jagan : ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా అది పూర్తి కాలేదని జగన్ బాధపడుతున్నారని విమర్శించారు. ప్రజలు ఇలా తీర్పు ఇచ్చారని ఆయన మదనపడతున్నారని, లేదంటే ఏపీని పూర్తిగా నాశనం చేసేవారని అన్నారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను అరాచకాలకు, అప్పులకు, దుర్మార్గాలకు నెలవుగా మార్చారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆక్షేపించారు.
అన్నపూర్ణ లాంటి రాష్ట్రానికి ఈ పరిస్థితి పట్టిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలు ఈ ఎన్నికల్లో ఏపీని కాపాడుకోవాలని చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారని తెలిపారు. మరోవైపు దిల్లీ లిక్కర్ స్కాం కంటే ఆంధ్రప్రదేశ్ భారీ మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఇక ఆయన జైలుకెళ్లకుండా తప్పించుకోలేరని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.