ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE : తిరుమలలో రథసప్తమి వేడుకలు - ప్రత్యక్షప్రసారం - TIRUMALA RATHASAPTHAMI 2025 LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2025, 6:18 AM IST

Tirumala Rathasapthami 2025 Live : కలియుగ ప్రత్యేక్షదైవం శ్రీవేంకటేశ్వరుని క్షేత్రం తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ  సందర్భంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సప్తవాహనాలపై శ్రీవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలిచే ఈ వేడుకల్లో  స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి అవతారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ  వాహన సేవలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమల చేరుకున్నారు. రథసప్తమి వేడుకల దృష్ట్యా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయ మాడ వీధుల్లోని భక్తులకు వేసవి తాపం కలగకుండా షెడ్లు ఏర్పాటు చేసింది. వాహన సేవలు వీక్షించేందుకు వీలుగా తిరుమల పలు ప్రాంతాల్లో పెద్ద ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేసింది. రథసప్తమి వేడుకల్లో భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ బ్రేక్ తోపాటు పలు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. తిరుపతిలో జారీ చేసే టైమ్‌ స్లాట్‌ సర్వదర్శన టోకెన్లు ఈనెల 3, 4, 5 తేదీల్లో నిలిపివేశారు.

ABOUT THE AUTHOR

...view details