ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఘనంగా వేంకటరమణుడి బ్రహ్మోత్సవాలు - బాలికతో కల్యాణోత్సవం - Venkateswara Swamy Brahmotsavam - VENKATESWARA SWAMY BRAHMOTSAVAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 9:01 AM IST

Prasanna Venkataramanudi Brahmotsavam in Rayadurgam: అనంతపురం జిల్లా రాయదుర్గంలో శ్రీ ప్రసన్న వేంకటరమణుడి బ్రహ్మోత్సవాలను నిర్వాహుకులు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా బాలికతో వెంకటరమణుడి కల్యాణోత్సవాన్ని జరపటం అరవా తెగకు ఆనవాయితీగా వస్తోంది. స్థానిక మార్కండేయ స్వామి ఆలయంలో పురప్రముఖులు, భక్తుల ఆధ్వర్యంలో రమేశ్, జయమ్మల కుమార్తె మౌనిక అనే బాలికతో శ్రీవారి నిశ్చితార్థం జరిపించారు. ఈ నెల 25న ప్రజల సమక్షంలో శ్రీదేవి, భూదేవిలతో పాటు బాలికతో వేంకటేశ్వరుడి ఉత్సవ విగ్రహంతో కల్యాణం చేయనున్నారు.

స్వామి వారి తరఫున ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలాక్షి రెడ్డి, రాయదుర్గం దేవదాయ శాఖ కార్యనిర్వాహణాధికారి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మేళతాళాలతో ఊరేగింపుగా బాలిక ఇంటికి చేరుకున్నారు. అప్పటికే పెళ్లికూతురుగా అలంకరించిన మౌనికను తల్లిదండ్రులు, బంధువులు ఊరేగింపుగా శ్రీ మార్కండేయ స్వామి ఆలయానికి తీసుకువచ్చి అర్చకులు బాలికతో వెంకటరమణుడి (కలశం)తో నిశ్చితార్థం చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details