ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఫేస్​బుక్​ ప్రియురాలి కోసం వేటకొడవలితో హత్యకు కుట్ర: కథ అడ్డం తిరిగి - Anantapur murder attempt

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 5:40 PM IST

Police Spoiled Murder Attempt in Anantapur: సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమైన ప్రియురాలిని దక్కించుకునేందుకు అడ్డుగా ఉన్న ఆమె భర్తను కడతేర్చేందుకు సిద్ధమయ్యాడు. హత్య చేయటం కోసం పలువురిని సంప్రదించాడు. ఎవరూ సహకరించకపోవటంతో తానే హతమార్చాలని పథకం పన్నాడు. దీని కోసం ప్రతిరోజూ రెక్కీ నిర్వహించి, వేట కొడవలి కొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పథకాన్ని భగ్నం చేసి నిందితున్ని రిమాండ్​కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం అనంతపురం జిల్లా ఉరవకొండలో సౌభాగ్య, నాగరాజు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గుంతకల్లు మండలం నక్కదొడ్డికి చెందిన భాస్కర్​తో మూడేళ్ల క్రితం ఫేస్​బుక్​లో పరిచయం ఏర్పడింది. సౌభాగ్య కుటుంబం తాడిపత్రికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. దీంతో సౌభాగ్య, భాస్కర్​ మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ విషయంలో ఆమె భర్త నాగరాజు తరుచూ గొడవ పడేవాడు. ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న ఆమె భర్త నాగరాజును ఎలాగైనా కడతేర్చాలని గోసాల భాస్కర్ భావించాడు. తనకు పరిచయమున్న చాలా మందితో ఈ విషయం చర్చించి నాగరాజును చంపాలని అందుకు కిరాయి ఇస్తానని చెప్పినప్పటికీ వారందరూ కుదరదని చెప్పి పోలీసులకు సమాచారం అందించారు. ఎవరూ ముందుకు వచ్చేలా లేరని భావించి తానొక్కడే కొడవలితో నరికి చంపాలని నిర్ణయించుకున్నాడు. నాగరాజు ప్రతిరోజూ ఉదయం బీడీల కోసం వస్తాడని తెలుసుకుని కొడవలితో భాస్కర్​ సిద్ధంగా ఉన్నాడు. భాస్కర్ సన్నిహితుల ద్వారా సమాచారం అందుకున్న తాడిపత్రి గ్రామీణ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి సిబ్బందితో వెళ్లి భాస్కర్​ను అరెస్టు చేసి హత్య కుట్రను భగ్నం చేసినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details