బ్రేకులేస్తే ఆగని 108 వాహనం- తీగలాగితే ఆ జిల్లాలో ఒక్కదానికి కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదు - Police Seize Ambulance - POLICE SEIZE AMBULANCE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 22, 2024, 6:25 PM IST
Kanigiri Police Seize the Ambulance: ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలానికి చెందిన ప్రభుత్వ అంబులెన్సు ఈనెల 9న ఓ వ్యక్తిని ఢీకొన్న కేసులో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే పోలీసులు వాహనానికి సంబంధించిన ఫిట్నెస్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను డ్రైవర్‌ను అడిగారు. సర్టిఫికేట్లు లేకపోవడంతో కేసు నమోదు చేసి వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతేకాక ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న 40 అంబులెన్స్‌ల్లో ఏ ఒక్క దానికి కూడా సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో పోలీసులు షాకయ్యారు. దీంతో అంబులెన్స్‌కు సంబంధించిన సర్టిఫికేట్లు చూపిస్తేనే వాహనం అప్పగిస్తామనటంతో చేసేదేమి లేక వాటిని సమకూర్చారు. పోలీసులు అంబులెన్సును ఆస్పత్రి సిబ్బందికి అప్పగించారు.
ఇటీవల అంబులెన్సు ఓ వ్యక్తిని ఢీకొట్టిన ఘటనలో పోలీసులు దానిని స్వాధీనం చేసుకోవడంతో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న అంబులెన్సులను కొనుగోలు చేసింది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. కానీ ఒక్కదానికి సరైన సర్టిఫికేట్సు లేవు. అంబులెన్స్‌లు రోడ్లపై తిరుగేందుకు అవసరమైన ధ్రువపత్రాలను సమకూర్చకపోవడంతో వాహన డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.