ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: అచ్యుతాపురంలో పవన్ కల్యాణ్​ వారాహి విజయభేరి బహిరంగసభ - ప్రత్యక్ష ప్రసారం - Pawan Kalyan Varahi Public meeting - PAWAN KALYAN VARAHI PUBLIC MEETING

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2024, 4:47 PM IST

Updated : May 1, 2024, 5:22 PM IST

Pawan Kalyan Varahi Live: ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో పవన్ కల్యాణ్​ వారాహి యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ వైసీపీపై నిప్పులు చెరిగారు. మన ఆస్తులపై జగన్ పెత్తనమేంటని ఆ హక్కు ఎక్కడదని పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మద్యపాన నిషేదం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్, మద్యం వ్యాపారం చేస్తూ 40 రూపాయల బాటిల్ 200 వందలకు అమ్మి ఐదేళ్లలో 40 వేల కోట్లు జేబులో వేసుకున్నాడని ప్రజలకు చెప్పారు. చంద్రబాబు పోలవరం 70 శాతంపైగా పూర్తి చేస్తే జగన్ ఆపేశాడన్నారు. రోడ్లు బాగుచేయడు, త్రాగునీరు, సాగునీరు ఇవ్వని జగన్ అవసరమా అని అన్నారు. అడ్డగోలుగా ఆస్తులు సంపాదించి 30 కేసుల్లో ముద్దాయిగా 16 నెలలు జైలు కేళ్లి వచ్చి బెయిల్ పై తిరుగుతున్న వ్యక్తి జగన్ అని ప్రజలకు పవన్ చెప్పారు. సుదీర్ఘ కాలం సిఎం గా పనిచేసిన చంద్రబాబు , కేంద్రంలో భాజపా లాంటి బలమైన పార్టీతో కూటమిగా మీ ముందుకు వస్తున్నాం గెలిపించాలని కోరారు.
Last Updated : May 1, 2024, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details