LIVE అవనిగడ్డలో పవన్ కల్యాణ్ వారాహివిజయభేరి సభ - ప్రత్యక్షప్రసారం - Pawan Kalyan Election Campaign - PAWAN KALYAN ELECTION CAMPAIGN
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 4, 2024, 7:24 PM IST
|Updated : May 4, 2024, 8:39 PM IST
Pawan Kalyan Election Campaign in Repalle Live: ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేనాని బాపట్ల జిల్లాలోని అవనిగడ్డలో పవన్ కల్యాణ్ లో పర్యటించనున్నారు. అంతక ముందు నిర్వహించిన సభలో అధికార వైసీపీ అయిదేళ్ల పాటు సాగించిన అరాచకాలు, అభివృద్ధి నిరోధక విధానాలపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో జిల్లా అభివృద్ధికి తాము చేపట్టబోయే చర్యలు, అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాలు, మ్యానిఫెస్టోను వివరిస్తూ ప్రజల్లో భరోసా నింపారు. పవన్ సభకు జనం అధిక సంఖ్యలో తరలిరావడం ఆ పార్టీ అభ్యర్థులు, శ్రేణుల్లో జోష్ నింపింది.వైసీపీ ఆరాచక పాలనకు అంతం పలకాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. వైసీపీని ఓడించే సమయం ఆసన్నమైందని ఆ పార్టీని ఓడించకపోతే యువత ఉపాధి ఉండదన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గిద్దలూరు మండలంలోని గుండ్లమోటుకు తెలుగుగంగ ప్రాజెక్టు నీటిని అనుసంధానం చేయాలన్నది దశాబ్దాల కల అని అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రేపల్లె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్‌కల్యాణ్ ప్రసంగిస్తున్నారు.
Last Updated : May 4, 2024, 8:39 PM IST