బురద గుంటలో ఈత- రోడ్డు దుస్థితిపై వినూత్న నిరసన - CPM Party protest damaged roads - CPM PARTY PROTEST DAMAGED ROADS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 25, 2024, 4:49 PM IST
Parvathipuram Manyam CPM Party Secretary Kolli Gangu Naidu Protest : పార్వతీపురం నుంచి రాయగడ వెళ్లే అంతరాష్ట్ర రహదారిపై పెద్ద పెద్ద గోతులలో నీరు నిలిచిపోయి అధ్వానంగా ఉంది. దీనితో మంగళవారం కొమరాడ సమీపంలో ఉన్న రహదారి గోతులలో పార్వతీపురం మన్యం జిల్లా సీపీఎం పార్టీ కార్యదర్శి కొల్లి గంగునాయుడు ఈత కొడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు అధ్వానంగా ఉన్నా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చాలా ప్రమాదాలు జరిగాయని, ఎన్ని సార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన లేదని మండిపడ్డారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు ధ్వజమెత్తారు. రోడ్డు సరిగ్గా లేక ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ అధకారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా కొలువుదీరిన కూటని ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.