ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మంత్రి బుగ్గన ఇంటిని ముట్టడించిన ఎన్​ఎస్​యూఐ నాయకులు - అరెస్ట్​ చేసిన పోలీసులు - NSUI leaders Protest dsc issue

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2024, 1:37 PM IST

NSUI Leaders Protest the House of Minister Buggana Rajendra Prasad in Nandyala District : దగా డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ ముద్దు అంటూ నంద్యాల జిల్లాలో ఎన్​ఎస్​యూఐ (NSUI - National Students Union of India) నాయకులు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్​ ఇంటిని ముట్టడించారు. 25 వేల టీచర్​ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు. ముట్టడికి యత్నించిన ఎస్​ఎస్​యూఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్​ఎస్​యూఐ నాయకులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే సీఐ ప్రవీణ్​ కుమార్​ కింద పడిపోయారు. 

మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్​కు ఆందోళనకారులు వినతిపత్రం ఇవ్వకుండానే పోలీసులు వారిని అరెస్ట్​ చేసి స్టేషన్​కు​ తరలించారు. ఉపాధ్యాయ నియామకాల కోసం విడుదల చేసిన డీఎస్సీ 2024 నోటిఫికేషన్​ను వెంటనే రద్దు చేసి మెగా డీఎస్సీని విడుదల చేయలని ఎన్​ఎస్​యూఐ నాయకులు డిమాండ్​ చేశారు. సీఎం జగన్​ 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన 25 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఎక్కడా అని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details