ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏపీలో కొత్త లిక్కర్ పాలసీపై కసరత్తు - New Liquor Policy in Andhra Pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 6:51 PM IST

new_liquor_policy_in_ap_four_teams_formed (ETV Bharat)

New Liquor Policy in Andhra Pradesh Four Teams Formed to Work in Six States : నూతన మద్యం విధానం రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ముగ్గురు అధికారులు ఉండనున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఈ బృందాలు  వెళ్లనున్నాయి. ఆయా రాష్ట్రాల ఎక్సైజ్ పాలసీ, షాపులు, బార్లు, ధరలు, మద్యం కొనుగోళ్లు, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేయనున్నాయి. ట్రాక్ అండ్ ట్రేస్, డీ-అడిక్షన్ సెంటర్ల నిర్వహణపైనా అధికారులు దృష్టి సారించనున్నారు. అక్కడి అత్యుత్తమ విధానాలను ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఈ నెల 12వ తేదీలోగా నివేదికల సమర్పించాలని నాలుగు అధ్యయన బృందాలను ప్రభుత్వం ఆదేశించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. 

ABOUT THE AUTHOR

...view details