ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం- ప్రత్యక్షప్రసారం - Nara Brahmini Election Campaign - NARA BRAHMINI ELECTION CAMPAIGN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 3:17 PM IST

Updated : Apr 30, 2024, 3:43 PM IST

Nara Brahmini Election Campaign at Mangalagiri Live :  గుంటూరు జిల్లా మంగళగిరిలో మహిళలకు ప్రాధాన్యమిచ్చే సంస్థలను స్థాపిస్తామని హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలో ఈరోజు విస్తృతంగా పర్యటించారు. మామిడికాయ పచ్చడి తయారు చేసే మహిళా కార్మికులతో బ్రాహ్మణి ముచ్చటించారు. వారితో కలిసి మామిడికాయ ముక్కలు కొట్టి పచ్చడి తయారు చేశారు. చెరకు రసం తయారుచేసే మహిళల బాగోగులు తెలుసుకున్నారు. అనంతరం స్వర్ణకారులు, వస్త్రవ్యాపారులతో భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని నులకపేటలో 'స్త్రీశక్తి' పథకం కింద కుట్టు శిక్షణ పొందిన మహిళలు, డ్వాక్రా సభ్యులతో సోమవారం సాయంత్రం ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళాసాధికారతే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు, లోకేశ్ మహిళలను మహాశక్తిగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారని బ్రాహ్మణి  పేర్కొన్నారు. మంగళగిరిలో లోకేశ్ అమలు చేస్తున్న 'స్త్రీశక్తి' పథకం ద్వారా 2,610 మంది కుట్టు శిక్షణ తీసుకుని ఉపాధి పొందుతున్నారని, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళతామని వెల్లడించారు. 
Last Updated : Apr 30, 2024, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details