పిల్లలతో వాలీబాల్ ఆడిన నారా బ్రాహ్మణి - BRAHMANI PLAYED VOLLEYBALL - BRAHMANI PLAYED VOLLEYBALL
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 6, 2024, 8:10 AM IST
|Updated : May 7, 2024, 7:37 AM IST
Nara Brahmani Played Volleyball with Childrens in Mangalagiri: ఏపీలో రాజ్యాంగం ప్రకారం పాలన జరగడం లేదని నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎస్ఆర్ ప్యారడైజ్ అపార్టుమెంటు వాసులతో సమావేశమై సమస్యలను తెలుసుకున్నారు. నారా బ్రాహ్మణి క్రీడా ప్రాంగణంలో పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడి అలరించారు. అక్కడ ఉన్న పిల్లలతో ముచ్చటించారు.
అయిదేళ్లుగా మహిళలకు భద్రత కల్పించడంలో జగన్ సర్కారు విఫలమైందని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధికి అడుగులు పడాలంటే ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి రావాలని తెలియజేశారు. భవిష్యత్తు బాగుండాలంటే కూటమిని గెలిపించుకోవాలని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబుతోనే సాధ్యం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత అయిదేళ్లుగా మంగళగిరిలో రోడ్లు, భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ కూడా సరిగాలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంగళగిరిని ఎడ్యుకేషన్ హబ్‌తో పాటు కల్చరల్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో అందరూ బాధ్యతగా ఓటేయాలని, లేదంటే భవిష్యత్తులో మన ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోతుందన్నారు.