ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

"కష్టకాలంలో ఆదుకున్నారు - టీడీపీకి జీవితాంతం రుణపడి ఉంటాం"

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 3:22 PM IST

Nara Bhuvaneshwari Nijam Gelvali Yatra: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక పలువురు అభిమానులు మరణించారు. అలా మరణించిన వారి కుటుంబాలను చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. అలా భువనేశ్వరి తమ ఇంటికి రావడం బాధలో ఉన్నప్పటికీ ఆనందంగా ఉందని, పుట్టపర్తి నియోజకవర్గంలోని గాజులపల్లి గ్రామంలో మృతి చెందిన బాబయ్య భార్య అంటోంది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక తన భర్త గుండెపోటుతో మరణించాడని, కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మాజీ మంత్రి, స్థానిక నేత పల్లె రఘునాథ్​ రెడ్డి ఆదుకున్నాడని ఆమె వివరించారు. తమకు మనోధైర్యాన్నిచ్చిన టీడీపీ నేతలకు తామెంతో రుణపడి ఉంటామని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాంటిది ఈ రోజు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తమ కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారంటే, తమకు చాలా ఆనందగా ఉందని వివరించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న తమకు టీడీపీ ఆసరాగా ఉందని, అందుకు తెలుగుదేశానికి జీవితాంతం రుణపడి ఉంటామని వివరించారు.

నిజం గెలవాలి యాత్రలో భాగంగా భువనేశ్వరి శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ఆమెకు హిందూపురం పార్లమెంటు తెలుగుదేశం నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె అక్కడి నుంచి గాజులపల్లి గ్రామానికి బయలుదేరి వెళ్లారు. 

ABOUT THE AUTHOR

...view details