ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎన్నికల నిర్వహణపై ఈసీ ముఖేశ్ సమీక్ష- అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2024, 2:13 PM IST

Mukesh Kumar Review For Preparation on Conduct of General Elections: రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధత అధికారులు తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నారు. ఓటర్ల జాబితా నవీకరణ, ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, కనీస వసతులు కల్పన, అధికారులు, సిబ్బంది నియామకం, ఎన్నికల అధికారులకు, సిబ్బందికి ఇచ్చే శిక్షణపై ముఖేష్ సమీక్ష చేపట్టారు. 

State Chief Electoral Officer Mukesh Kumar Meena Review through Video Conference: జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రణాళిక, ప్రాంతాల వారీగా పోలింగ్ స్టేషన్​లో మ్యాపింగ్, అక్రమ నగదు స్వాధీనం, వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై అధికారులు తీసుకున్న చర్యలను ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా​ ముఖేష్ కుమార్ సమీక్షించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details