గడపగడపకు కార్యక్రమంలో ఎంపీ వంగా గీతకు నిరసన సెగ- సమస్యల పరిష్కారంపై నిలదీత - MP Vanga Geetha Gadapa Program
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 11, 2024, 10:28 AM IST
MP Vanga Geetha Gadapa Gadapaku Program: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం(Gadapa Gadapaku Mana Prabhutvam) లో కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు, వైసీపీ పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీతకు నిరసన సెగ తగిలింది. కాకినాడ జిల్లా కొమరగిరి పంచాయతీ పరిధి శివారు గ్రామాల్లో పర్యటిస్తున్న గీతను దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్‌సాగర్ రామకృష్ణ( Dalit Rights Struggle Samiti District Convener Sagar Ramakrishna) అడ్డుకున్నారు.
Protest Against MP Vanga Geetha: గ్రామం నిండా సమస్యలు వెంటాడుతుంటే పరిష్కరించకుండా గడపగడపకు ఎలా తిరుగుతారని ఎంపీ గీతను నిలదీశారు. గ్రామంలో సమస్యలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఉన్నా వారంతా సొంత పనులకు తప్ప ప్రజా సేవకు పాటుపడట్లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామ సమస్యల పరిష్కారంపై తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.