జగన్ రాజకీయ భవిష్యత్తుపైనే ఎన్నికలు- రఘురామ కృష్ణంరాజు - MP RAGHURAMa krishna raju - MP RAGHURAMA KRISHNA RAJU
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 19, 2024, 7:00 PM IST
Mp Raghurama krishna Raju Rachabanda Program: రాష్ట్రంలో డీజీపీ, చీఫ్ సెక్రటరీ, విజిలెన్స్ చీఫ్ వీరి ముగ్గురిపై ఎన్నికల సంఘం బదిలీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అవసరమని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. వీరి ముగ్గురు పై వేటు వేస్తేనే రాష్ట్రంలో ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి అన్నారు. ఈరోజు భీమవరంలోని ఆయన నివాసం వద్ద రచ్చబండ కార్యక్రమం సందర్భంగా మాట్లాడారు.
గులకరాయి డ్రామా ఘటనతో పార్టీ ఇమేజ్ మరింత తగ్గిందని రఘురామ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి కూటమి అభ్యర్థిగా ఈనెల 22న నామినేషన్ వేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజుతో కలిసి పనిచేసి తప్పనిసరిగా విజయం సాధిస్తానని తెలిపారు. జగన్ను ఉంచాలా, ఇంటికి పంపించాలా అనే అంశంపై ఎన్నికలు జరుగుతున్నామని నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు తెలిపారు. చంద్రబాబు ఈనెల 21న పార్టీ అభ్యర్థులకు బీఫారంలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు సమావేశాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని రఘురామ కృష్ణ రాజు పేర్కొన్నారు.