ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కాంగ్రెస్​లోకి సొహెల్ ! ​- ఎంపీ అవినాష్ రహస్య మంతనాలు - MP Avinash talks with Sohel - MP AVINASH TALKS WITH SOHEL

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 22, 2024, 2:45 PM IST

MP Avinash Talks With Sohel : మాజీ మంత్రి ఖలీల్ భాషా కుమారుడు డాక్టర్ సోహెల్ గత కొంతకాలం నుంచి వైసీపీలో కొనసాగుతున్నారు. కానీ సోహెల్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లు ఊహాగానాలు రావడంతో హుటాహుటిన ఎంపీ అవినాష్ రెడ్డి వెళ్లారు. దాదాపు అరగంట పాటు ఎంపీ అవినాష్ రెడ్డి సోహెల్​తో రహస్య మంతనాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లొద్దంటూ ఎంపీ అవినాష్ రెడ్డి కోరారు. పార్టీ అధికారంలోకి రాగానే తగిన ప్రాధాన్యత ఇస్తామంటూ ఎంపీ భరోసా ఇచ్చినట్లు సమాచారం. 

మొదట్లో సోహెల్ కడప వైసీపీ టికెట్ ఆశించారు. కానీ అంజాద్ భాషాకు కేటాయించడంతో సోహెల్ అప్పటి నుంచి మౌనంగా ఉన్నారు. కడప కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సోహెల్ బరిలోకి దించేందుకు అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎంపీ ఆయన నివాసానికి వెళ్లి మంతనాలు జరిపారు. పార్టీ అధికారంలోకి రాగానే తగిన ప్రాధాన్యత కల్పిస్తామంటూ ఎంపీ ఆయనకు తెలిపారు. మరి సోహెల్ వైసీపీలో కొనసాగుతారా ? లేదా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా ? అనేది వేచి చూడాల్సి ఉంది. 

ABOUT THE AUTHOR

...view details