ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విజయవాడలో "హెల్త్‌ ఆన్‌ వీల్స్‌" - ఎంపీ కేశినేనితో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి - Health on Wheels Programme

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 9:10 PM IST

MLA Sujana Chaudhary Started Health on Wheels Programme: వైద్య చికిత్సల కంటే వ్యాధి నివారణే ముఖ్యమని ఎమ్మెల్యే సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. విజయవాడలోని కేబీఎన్ కళాశాలలో సుజనా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన "హెల్త్ ఆన్ వీల్స్" కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్​తో కలిసి ఆయన ప్రారంభించారు. ఆరోగ్య శిబిరం ద్వారా టీబీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటి 20 రోగాలకు సంబంధించిన పరీక్షలకు స్క్రీనింగ్​ నిర్వహిస్తారని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. దేశంలో 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసులోనూ క్యాన్సర్ వస్తుందని, దీనిని ముందే గుర్తించి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సుజనా విజ్ఞప్తి చేశారు. ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన లేదని అందుకే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, వ్యాధుల నివారణ ఎందుకు ముఖ్యమో వివరించి చెప్పడానికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. లిక్కర్, ఫుడ్, మందుల కంపెనీలు ఎక్కడ చూసినా అభివృద్ధి చెందుతున్నాయని ఆరోగ్యంపై అందరికీ అవగాహన అవసరమని చెప్పారు. మీడియా పబ్లిసిటీ కోసం ఈ కార్యక్రమం చేయడం లేదని ఎమ్మెల్యే సుజనా చౌదరి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details