శ్వేతపత్రంలో 'శ్వేత' ఎవరనే రకాలు వైఎస్సార్సీపీ నేతలు: టీడీపీ ఎమ్మెల్యే సెటైర్ - MLA Adireddy Vasu about jagan - MLA ADIREDDY VASU ABOUT JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 26, 2024, 5:42 PM IST
MLA Adireddy Vasu Sensational Comments On YS Jagan : జగన్‌కి చిన్న మెదడు పోయిందని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దుయ్యబట్టారు. అసెంబ్లీకి రాకుండా దిల్లీలో చిత్ర విచిత్ర విన్యాసాలు చేశారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ హయాంలో క్రైం క్యాపిటల్, గంజాయి క్వాపిటల్‌గా మారిన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. వైఎస్సార్సీపీ బిస్కెట్లకు ఆశపడి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు తనను పార్టీ మారమని ఎంతో ఒత్తిడి చేశారని గుర్తు చేసుకున్నారు. జగన్ ఇకనైనా అసెంబ్లీకి రావాలని కోరారు.
అసెంబ్లీకి జగన్ వస్తేనే బాగుంటుందని అన్నారు. అసెంబ్లీకి రావాలి జగన్- కావాలి జగన్ అన్నదే తమ నినాదంగా పేర్కొన్నారు. కేసులు ఎంతమంది మీద ఉన్నాయి అని నిన్న సీఎం అడిగితే నిలబడిన ఎమ్మెల్యేల కళ్లన్నీ జగన్ అసెంబ్లీ రాక కోసం వేచి చూస్తున్నారని ఆదిరెడ్డి వాసు తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలకు కనీసం శ్వేత పత్రం అంటే ఏంటో తెలుసో లేదో అని ఎద్దేవా చేశారు.