23 రోజుల క్రితం వృద్ధురాలు అదృశ్యం- కాలువలో లభ్యమైన మృతదేహం - వృద్ధురాలు కాలువలో పడి మృతి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2024, 3:24 PM IST
Missing Old Woman Fell Into Canal At Died: సుమారు 23 రోజుల క్రితం అదృశ్యమైన వృద్ధురాలు కాలువలో పడి మృతి చెందిన ఘటన సోమవారం తణుకు పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముంటున్న పైడిముక్కల గంగాదేవి (75) మతిస్థిమితం సరిగా లేదు. ఈ క్రమంలో గత నెల 18న ఇంట్లో నుంచి ఆమె బయటకు వెళ్లిపోయారు. తణుకు పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆమె కుమారుడు వీరవెంకటసత్యనారాయణ తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పట్టణ ఎస్సై కె. శ్రీనివాసరావు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం వెంకట్రాయపురం ఆంధ్రా షుగర్స్ సమీపంలోని గోస్తనీ నదిలో గుర్తు తెలియని ఓ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లిన తణుకు రూరల్ పోలీసులు అది గంగాదేవిగా పోలీసులు నిర్ధారించారు. దీనిపై పట్టణ పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వృద్ధురాలు మృతదేహం చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.