సాంస్కృతిక సంబరాల్లో కళాకారుల ఎంపిక - గుర్తింపు కార్డులు జారీ : మంత్రి రోజా - జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 21, 2024, 12:33 PM IST
Minister RK Roja Gave ID Cards To Artists : రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులకు గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 4,000 మంది కళాకారులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇక నుంచి నిరంతరం గుర్తింపు కార్డులను జారీ చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సాంస్కృతిక సంబరాల ద్వారా డేటా సేకరించి కళాకారులను గుర్తిస్తామని రోజా వెల్లడించారు.
ప్రతి జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాలు : గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కళాకారులు డేటా తీసుకోకపోవడం వల్లనే వారు అనేక ఇబ్బందులు పడ్డారని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కళాకారులను గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం డేటా సేకరించడం వల్లనే కళాకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయడం సులభం అయ్యిందని తెలిపారు. భావి తరాలకు మన కళారూపాన్ని, జానపదాలను అందించాలని పిలుపునిచ్చారు. ఇప్పటి నుంచి ప్రతి జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి రోజా ప్రకటించారు.