ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ట్రిపుల్ ఐటీలో ఆహార నాణ్యత లోపాలను సహించే ప్రసక్తే లేదు : మంత్రి పార్థసారథి - MINISTER PARTHASARATHY ON IIIT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2024, 12:44 PM IST

Minister Parthasarathy fire on Nuziveedu IIIT maintance in Eluru : నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆహార నాణ్యత లోపాలను సహించే ప్రసక్తే లేదని మంత్రి పార్థసారథి హెచ్చరించారు. మెస్‌ను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ట్రిపుల్ ఐటీని సందర్శించిన మంత్రి పార్థసారథి విద్యార్థులు, అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఆహారం దారుణంగా ఉంటోందని, పరిశుభ్రత ఉండనే ఉండదని, మెస్‌ కమిటీ ఎందుకూ పనిరాదని మంత్రికి విద్యార్థులు ఫిర్యాదు చేశారు. పుడ్ కోర్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏ సమస్య చెప్పినా పరిష్కారం కాకపోగా ఫిర్యాదు చేసిన వారిపై కక్షగట్టి అంతర్గత మార్కుల్లో కోత పెడతామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు.

విద్యార్థులకు పార్థసారథి నచ్చజెప్పి సమస్యలన్నీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ట్రిపుల్ ప్రాంగణంలో కలియదిరిగి పరిస్థితులను తెలుసుకున్నారు. మెస్ అత్యంత అపరిశుభ్రంగా ఉండటాన్ని చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం ఆసుపత్రిని సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న వారిని మంత్రి పరామర్శించారు. మంత్రి సందర్శించిన సమయంలోనే ట్రిపుల్ ఐటీలో రాత్రి భోజనం తిన్న నిర్మల అనే విద్యార్థిని కళ్లు తిరిగి పడిపోయింది. ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details