LIVE : హైదరాబాద్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రెస్ మీట్ - MINISTER KOMATIREDDY LIVE - MINISTER KOMATIREDDY LIVE
Published : Apr 26, 2024, 12:26 PM IST
|Updated : Apr 26, 2024, 12:46 PM IST
Minister Komati Reddy Press meet : మెదక్‌లో మాజీమంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఆగస్టు 15లోపు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న ఆయన హామీల అమలుపై సీఎం అమరవీరుల స్తూపం వద్దకు రావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ హరీశ్‌రావు రాజీనామా పత్రంతో అమరవీరుల స్తూపం వద్దకు వచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించి తాను రాజీనామా పత్రంతో వచ్చానని హరీశ్‌రావు తెలిపారు. ప్రజలకు రేవంత్ ఇచ్చిన హామీలు నిజమైతే గన్‌పార్క్ వద్దకు రావాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రావడానికి ఇబ్బందిగా ఉంటే వారి పీఏ, సిబ్బందితో రాజీనామా లేఖను ఇక్కడికి పంపించినా ఫర్వాలేదని అన్నారు. మేధావుల చేతుల్లో ఇద్దరి రాజీనామా పత్రాలు పెడదామని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. హరీశ్ రావు కేవలం బీఆర్ఎస్ ఉద్యోగి ాత్రమేనని అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Last Updated : Apr 26, 2024, 12:46 PM IST